Pages

Thursday, September 27, 2012

రెబల్ ఎంట్రీ... జులాయి, శ్రీమన్నారాయణ కిక్స్ ఔట్!

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తమన్నా జంటగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘రెబల్' చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలతో ప్రభాస్ ఇప్పటికే రెండు వరుస హిట్లు కొట్టడంతో ‘రెబల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా...రెబల్ సినిమా భారీ విడుదల నేపథ్యంలో కొన్ని ముఖ్య సెంటర్లలో జులాయి, శ్రీమన్నారాయణ చిత్రాలను తీసేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి' చిత్రం ఆగస్టు 9న విడుదలై ఇప్పటికే పలు సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ సాధించింది. రెబల్ గ్రాండ్ రిలీజ్ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ థియేటర్లలో సినిమా 100 రోజులు పూర్తి కాకముందే ఎత్తేస్తున్నారు.
బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ చిత్రం కూడా ఆగస్టు 30 భారీగా రిలీజైంది. ఈ చిత్రం ఇప్పటికి 30 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే పెట్టుబడి రాబట్టుకుని ఓ మోస్తరు ఫ్రాఫిట్‌‍తో రన్ అవుతోంది. అయితే రెబల్ చిత్రం విడుదల నేపథ్యంలో శ్రీమన్నారాయణ 50 రోజుల పూర్తి కాక ముందే చాలా థియేటర్లలో తీసేస్తున్నారు. ఇది బాలయ్య అభిమానులకు మింగుడు పడని విషయమనే చెప్పుకోవచ్చు.
ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

No comments:

Sample Text

Darling
Mr.Perfect
 

LOADING....................