Pages

Sunday, July 22, 2012

ప్రభాస్‌ సినిమా టైటిల్‌పై రాజమౌళి క్లారిటీ


'మగధీర', 'యమదొంగ' లాంటి సోషియోఫ్యాంటసీ చిత్రాలను సృష్టించిన 'జక్కన్న' రాజమౌళి త్వరలోనే మరో చారిత్రాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా తను రూపొందించిన సైన్స్ ఫిక్షన్ గ్రాఫికల్ వండర్ మూవీ ‘ఈగ' సక్సెస్‍‌తో చాలా హ్యాపీగా ఉన్న రాజమౌళి తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు సమాచారం. ఇందులో విశ్వామిత్రగా 'యంగ్ రెబల్ స్టార్' ప్రభాస్ నటించబోతున్నారు.

ఈ చిత్రానికి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర' లేదా ‘విశ్వామిత్ర' అనే టైటిల్ పెట్టే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలను తాజాగా ఈ రోజు రాజమౌళి ఖండించారు. ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

రాజమౌళి దర్సకత్వంలో రూపొందబోయే చిత్రం కోసం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిళ్లా సమయంలో తన బాడీ షేప్ పై దృష్టి పెట్టిన ప్రభాస్ మరోసారి తన బాడీ పవర్ చూపించాలని ప్రిపేర్ అవుతున్నాడు. ఆ విషయమై ప్రభాస్ కి రాజమౌళి స్ట్రిక్ట్ గా చెప్పినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ప్లాన్ జరిగిపోయినట్టు తెలుస్తుంది. ఈగ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెట్టినందుకు గానూ తరువాత సినిమాను వీలయినంత తక్కువ టైంలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నారు.

దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ ల వచ్చిన ఛత్రపతి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

No comments:

Sample Text

Darling
Mr.Perfect
 

LOADING....................